తండేల్ సినిమాతో ఘన విజయం సాధించిన యువ సామ్రాట్ నాగచైతన్య ఇప్పుడు పుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అక్కినేని కుటుంబంలో తొలి సెంచరీ హీరోగా చరిత్ర సృష్టించిన ఆయన, తదుపరి సినిమాపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చైతన్య తన 24వ చిత్రంగా విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తవగా, తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో భారీగా ప్రారంభించారు.
ఈ కొత్త షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్లోనే వరుసగా 15 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో నాగచైతన్యతో పాటు హీరోయిన్ మరియు ఇతర ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నారు. ఈ సీన్స్ సినిమా లో కీలక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. ఇందులో చైతన్యను మరింత కొత్తగా చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. “నెవర్ బిఫోర్” లుక్స్‌తో చైతన్య అభిమానులను ఆకట్టుకోనున్నాడు.
ఇప్పటివరకు లవర్ బోయ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన నాగచైతన్య ఈ సినిమా ద్వారా తనకు కొత్త ఇమేజ్‌ని కలిగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. విరూపాక్షతో భారీ విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతారా సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కథ, సంగీతం, చైతన్య పాత్ర – ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని 2025లో మరో హిట్‌గా నిలబెడతాయని చిత్ర వర్గాలు ధీమాగా భావిస్తున్నాయి.

One thought on “నాగచైతన్య 24వ సినిమా.. 15 రోజులు భారీ సెట్లో షూటింగ్!”
Comments are closed.