సీతాకోకచిలుకలతో మెరిసిన వామికా గబ్బి గ్లామర్ గేమ్!

Effect of change in movies

బాలీవుడ్ రైజింగ్ స్టార్ వామికా గబ్బి మరోసారి ఫ్యాషన్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. ‘భూల్ చుక్ మాఫ్’ సినిమా విడుదలకు ముందు ముంబైలో జరిగిన హై-ఫ్యాషన్ గాలాలో వామిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రామాటిక్ లుక్‌తో ర్యాంప్‌పై మెరిసిన వామిక తన అందాన్ని మరింతగా పెంచేలా స్ట్రాప్‌లెస్ కైలానీ బ్లాక్ గౌన్‌ను ఎంపిక చేసుకుంది.

ప్లంగింగ్ నెక్‌లైన్ ఉన్న ఈ డ్రెస్ మెలోన్ క్రేప్ క్రిస్టల్ ఫాబ్రిక్‌తో తయారయ్యింది. రిఫ్లెక్టివ్ షిమ్మర్‌ లేదా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ డ్రెస్ ప్రత్యేకత ఏంటంటే… దానిపై కళాత్మకంగా డిజైన్ చేసిన సీతాకోకచిలుకలు! నల్లటి గౌనుపై సీతాకోక చిలుకల డిజైన్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా వామిక ధరించిన సీతాకోకచిలుకల హెడ్‌బ్యాండ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

ఇది పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేసినదిగా తెలుస్తోంది. సెమిప్రెషియస్ రాళ్లు, గాజు పూసలు, ఇత్తడి పదార్థాలతో ఎంతో శ్రద్ధతో తయారుచేసిన ఈ హెడ్‌బ్యాండ్ ఫ్యాషన్ ప్రేమికులను మెప్పిస్తోంది.

ఇక ఆమె స్టైలింగ్ విషయానికొస్తే — నల్లటి స్టడెడ్ చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్, మ్యాట్ బ్లాక్ మానిక్యూర్ ఎంపిక చేసుకుని లుక్‌ను పూర్తిచేసింది. ప్రఖ్యాత “ది వర్డ్” మ్యాగజైన్ కాస్ట్యూమ్ గాలాలో ఆమె ర్యాంప్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. సోషల్ మీడియాలో వామిక ఫోటోలు వైరల్ అవుతుండటంతో, ఈ లుక్ ట్రెండ్ సెట్ చేస్తోంది.

Read More

One thought on “సీతాకోకచిలుకలతో మెరిసిన వామికా గబ్బి గ్లామర్ గేమ్!

Comments are closed.