‘పెద్ది’లో రైల్వే ఫైట్ సీన్ హైలైట్ అవుతుందా?

Ram Charan Peddi Railway Station Fight Scene

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, క్రీడా నేపథ్యంలో సాగే ఓ పవర్‌ఫుల్ డ్రామాగా రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన రఫ్ అండ్ రగ్డ్ లుక్, ఉత్తరాంధ్ర యాసలో పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ రైల్వే స్టేషన్ సెట్‌లో కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తోంది. ఈ సీన్ సినిమాకు హైలైట్ కానుందని, కథలో కీలక మలుపు తిప్పే మైల్‌స్టోన్ సన్నివేశంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. చరణ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను ఆగస్టు కల్లా పూర్తి చేయాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు షెడ్యూల్‌ను స్పీడ్‌గా కంప్లీట్ చేస్తుండటంతో షూటింగ్ దశ వేగంగా ముందుకెళ్తోంది.

ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం సమాంతరంగా కొనసాగుతున్నాయి.

Read More

One thought on “‘పెద్ది’లో రైల్వే ఫైట్ సీన్ హైలైట్ అవుతుందా?

Comments are closed.