రాజమౌళి హైప్ క్రియేట్ చేసిన మూడు భారీ సినిమాలు!

Rajamouli's Upcoming Movies

దర్శకుడిగా ప్రపంచ సినీ రంగంలో తన కౌశలాన్ని చాటిన ఎస్.ఎస్. రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’తో జపాన్ లో కూడా భారీ విజయాన్ని సాధించారు. ఈ సినిమా అక్కడ అత్యధిక వసూళ్లు సాధించి, భారతీయ సినిమాలకు మరింత గౌరవాన్ని తెచ్చింది. తాజాగా, ‘RRR: Behind and Beyond’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కావడంతో రాజమౌళి అక్కడ ప్రమోషన్ల కోసం వెళ్లారు.

జపాన్‌లో ఓ ఇంటర్వ్యూలో, తనకు అత్యంత ఆసక్తి కలిగించే మూడు సినిమాలను రాజమౌళి పేర్కొన్నారు. “ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’, ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’, రామ్ చరణ్ – బుచిబాబు సానా కాంబినేషన్‌లో ‘పెద్ది'” అని జక్కన్న వివరణ ఇచ్చారు. ఈ మూడు సినిమాలపై ఇండియన్ సినిమా పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో ‘డ్రాగన్’ మరియు ‘పెద్ది’ షూటింగ్ దశలో ఉన్నప్పటికీ, ‘స్పిరిట్’ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయినప్పటికీ, ఈ సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ వ్యాఖ్యలతో రాజమౌళి సినిమాలపై మరింత హైప్‌ను పెంచినట్లయింది.

ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు‌తో తన తదుపరి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘SSMB29’ పై దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒడిశా లోని షెడ్యూల్స్ పూర్తయింది. ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న ఈ సినిమాను ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read More

One thought on “రాజమౌళి హైప్ క్రియేట్ చేసిన మూడు భారీ సినిమాలు!

Comments are closed.