ఐపీఎల్ స్పెషల్‌: కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్!

Ram Charan Campa brand ambassador

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా ఉండడమే కాదు, పలు నేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్నాడు. తాజాగా రిలయన్స్ గ్రూప్‌కు చెందిన ప్రముఖ బేవరేజ్ బ్రాండ్ “కాంపా”కి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంపికయ్యాడు.

ఈ సందర్భంగా “కాంపా వాలి జిద్” పేరిట ప్రత్యేక కమర్షియల్ వీడియోను రూపొందించారు. మిలీనియల్స్, జెన్-జె ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ యాడ్‌ వీడియో ఐపీఎల్ సీజన్‌లో వివిధ భాషల్లో టీవీ, మొబైల్ యాప్‌ల ద్వారా ప్రదర్శించనున్నారు. ఈ ప్రచారం కాంపా బ్రాండ్ అమ్మకాలు పెరగడానికి తోడ్పడనుందని అంచనా.

ఈ కమర్షియల్ షూట్‌ను రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా “పెద్ది” షూటింగ్ మధ్యలో పూర్తి చేశాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండగా, చరణ్ ఓ గ్రామీణ యువకుడిగా కనిపించనున్నాడు. దీంతో పాటు కాంపా ప్రకటనలోనూ అతడి ఎనర్జీ ఫుల్ స్క్రీన్ మీద కనిపించనుంది.

ఇంతవరకూ స్పోర్ట్స్ షూస్, పర్ఫ్యూమ్స్, యాప్స్, ఫుడ్ బ్రాండ్స్‌తో తన మార్కెట్‌ను పెంచుకున్న రామ్ చరణ్, ఇప్పుడు ఐపీఎల్ వేదికగా కూల్ డ్రింక్ ప్రచారంలో కనిపించనున్నాడు. చరణ్ బ్రాండ్ వాల్యూ మరోసారి చాటిచెప్పిన ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read More



One thought on “ఐపీఎల్ స్పెషల్‌: కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్!

Comments are closed.