సింపుల్ స్టైల్‌లో స్టన్నింగ్ లుక్ – వాణి కపూర్ టాక్ ఆఫ్ ది టౌన్

Vaani Kapoor latest photos

తెలుగు ప్రేక్షకులకు ‘ఆహా కళ్యాణం’ ద్వారా పరిచయమైన వాణి కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా, హృతిక్ రోషన్‌తో చేసిన ‘వార్‌’ సినిమా వాణీకి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ పరిశ్రమలో బిజీగా మారింది.

‘వార్’ తరువాత వాణి నటించిన ‘బెల్ బాటమ్’, ‘చండీగఢ్ కరే ఆషికి’ సినిమాలు మంచి స్పందన పొందాయి. స్టార్ హీరోలతో కలిసి నటించడం వాణి కపూర్‌ క్రేజ్‌ పెంచేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాలుగు సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో తన స్థానం మరింత పటిష్టం చేసుకుంటోంది. ఆమె నటించిన ‘రైడ్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.

సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ వాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 80 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె తరచూ గ్లామర్‌ ఫోటోలు, సినిమాల అప్‌డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఫోటోల్లో లాంగ్ ఫ్రాక్‌, లూజ్ హెయిర్‌ స్టైల్‌తో వాణి సింపుల్ అయినా ఎలిగెంట్ లుక్‌లో మెరిసిపోయింది. వయసు పెరుగుతున్నా గ్లామర్‌లో ఏమాత్రం తగ్గడం లేదని కొంతమంది కామెంట్ చేయగా, మరోసారి సౌత్ సినిమాల్లో కనిపించాలని కోరేవారూ ఉన్నారు. వాణి రీ ఎంట్రీ ఇస్తుందా అనే ఆసక్తి కొనసాగుతోంది.

Read More


One thought on “సింపుల్ స్టైల్‌లో స్టన్నింగ్ లుక్ – వాణి కపూర్ టాక్ ఆఫ్ ది టౌన్

Comments are closed.