తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకు ఉన్న ప్రత్యేక ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సూర్య.. ఇటీవలే “కంగువ” సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన తన 45వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు.
గ్రామీణ శైలిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం పూర్తయిందట. కథనాన్ని విభిన్నంగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంత ఆసక్తికరమైన కథలో నాయిక ఎవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సూర్య నటిస్తున్న తాజా సినిమాలో మలయాళీ నటి అనఘ మాయ రవి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించగా, ప్రస్తుతం “అలప్పుజ జింఖానా” సినిమా పనులతో బిజీగా ఉన్న ఆమె, టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని కలిగించింది.
“కాతల్” చిత్రంలో మమ్ముట్టి, జ్యోతికల కుమార్తె పాత్రలో నటించిన అనఘ మాయ రవికి, ఇప్పుడు సూర్య సినిమాతో స్టార్డమ్ చేరువగా కనిపిస్తోంది. టాలెంట్‌కి తోడు లుక్స్‌ను కలగలిపిన ఈ నటి, త్వరలోనే కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందే ఛాన్స్ ఉంది.

One thought on “యంగ్ హీరోయిన్ లక్కీ ఛాన్స్.. కోలీవుడ్ స్టార్ సూర్య సరసన!”
Comments are closed.