పెద్దపల్లిలో పసికూనపై యువకుడి అత్యాచారయత్నం

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్ పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఐదేళ్ల చిన్నారిపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో బాలిక భయంతో గట్టిగా కేకలు వేయడంతో, నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై ఇలాంటి దారుణ ఘటనలు వెలుగుచూస్తుండటంపై సామాజిక వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

Read More : వరంగల్ నిట్‌లో విద్యార్థి ఆత్మహత్య: హృతిక్ సాయి మృతదేహం చెరువులో గుర్తింపు

One thought on “పెద్దపల్లిలో పసికూనపై యువకుడి అత్యాచారయత్నం

Comments are closed.