రిషబ్ శెట్టికి పంజుర్లీ వారాహి దేవి హెచ్చరిక: శత్రువుల ముప్పు!

Rishab Shetty enemy threat

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విస్మయకరమైన అనుభవాన్ని పొందారు. మంగుళూరులో జరిగిన కద్రి బరెబైల్లో వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, పంజుర్లీ వారాహి దేవి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్భంలో దేవి ఆయనతో మాట్లాడుతూ – శత్రువులు నీ కుటుంబాన్ని నాశనం చేయాలనే కుట్రలు పన్నుతున్నారు అని హెచ్చరించిందట. అయితే ఏ విధమైన హానీ జరిగేలా నేను అనుమతించను, ఐదు నెలల్లో మీకు మంచి జరగుతుంది అని దేవి భరోసా ఇచ్చిందని సమాచారం.

‘కాంతారా’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్, తనను తాను ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నాడు. ఆ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా కీలక పాత్రలో నటించి నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. 16 కోట్ల బడ్జెట్‌తో తీసిన కాంతారా, దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఈ విజయంతో ప్రేరణ పొందిన రిషబ్, ఇప్పుడు కాంతారా సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతారా 2’ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ‘కాంతారా 2’ తరువాత రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ అనే చిత్రంలో హనుమంతుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం కూడా భారీగా రెడీ అవుతున్నారట. అంతేకాక, తెలుగు, తమిళ్ భాషల్లోనూ పలువురు దర్శకులు అతనితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయినా రిషబ్ మాత్రం పూర్తిగా ‘కాంతారా 2’పై ఫోకస్ పెట్టాడు. మొదట ఈ ఏడాది రెండవార్థంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల సినిమా కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More

One thought on “రిషబ్ శెట్టికి పంజుర్లీ వారాహి దేవి హెచ్చరిక: శత్రువుల ముప్పు!

Comments are closed.