తడబడిన ‘బేబి’.. అండగా నిలిచిన ‘జాక్’!

Vaishnavi Chaitanya Jack Movie Promotion

తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’ ప్రమోషన్‌లో భాగంగా అభిమానుల సమక్షంలో కాస్త తడబడి మాట్లాడిన వేళ, హీరో సిద్ధూ ఆమెకు ధైర్యం చెబుతూ మద్దతుగా నిలిచాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిన్న సంఘటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ఇటీవలి ఇంటర్వ్యూలో వైష్ణవి తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే అపోహలను తిప్పికొడుతూ, ఓపికతో ప్రయత్నిస్తే అవకాశాలు తప్పకుండా వస్తాయని చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే వచ్చిన గుర్తింపును కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను షేర్ చేస్తూ, అలియా భట్‌ నటన తనకు ఎంతో ఇన్‌స్పిరేషన్ అని పేర్కొంది. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ అయినా, డీగ్లామర్ అయినా తాను వెనకాడనని స్పష్టం చేసింది.

తన చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ, స్కూల్లో పెన్నులు దొంగిలించిన సంగతులు చెప్పింది. అలాగే షాపింగ్‌కి వెళ్లినప్పుడు చిన్న చిన్న వస్తువులు ఎవరికీ తెలియకుండా తీసుకున్నానని నవ్వుతూ గుర్తు చేసింది. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్‌లతో పాటు మంచి గాయని కూడా అయిన వైష్ణవి, అయ్యప్ప భజనల్లో పాటలు పాడిన అనుభవాన్ని పంచుకుంది. ‘లవ్‌ మీ’ సినిమా సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి దగ్గర శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది. తన హుందా ఆలోచనలు, నిజాయితీతో కూడిన వ్యవహారం ఆమెను ప్రేక్షకుల మనసుల్లో మరింత దగ్గర చేస్తోంది.

Read More




One thought on “తడబడిన ‘బేబి’.. అండగా నిలిచిన ‘జాక్’!

Comments are closed.