సూర్యాపేట జిల్లా కోదాడ మండలం మంగలి తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ 52, ఉపాధ్యాయుడు, మద్యం మత్తులో సిగరెట్ తాగుతూ నిద్రకు లోనవ్వడం వల్ల నిద్రలోనే అగ్నికి ఆహుతయ్యారు.

పండగ సందర్భంగా కుటుంబ సభ్యులు పుట్టింటికి వెళ్లిన వేళ, బాలాజీ ఒంటరిగా ఇంట్లో ఉండగా మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ మంచంపై పడుకున్నారు. అయితే ఆ సిగరెట్ ఆర్పకుండా ఉండిపోవడంతో, మంచంపై మంటలు చెలరేగాయి. కూలర్ గాలి తోడవడంతో మంటలు వేగంగా వ్యాపించి మొత్తం మంచాన్ని కబళించాయి. మత్తులో ఉండటం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ మంటలలో చిక్కుకుని బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మద్యం, ధూమపానం వల్ల ఏర్పడే ప్రమాదాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నదని పెద్దలూ, స్థానికులు చెబుతున్నారు.

One thought on “సిగరెట్ నిర్లక్ష్యంతో నిద్రలోనే మంటల్లో కాలిపోయిన ఘటన..”
Comments are closed.