తెలంగాణలో పెట్టుబడులకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి: మంత్రి శ్రీధర్‌బాబు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దిగుమతి సుంకాల విధానం భారత్‌కు అనుకూలంగా మారిందని తెలంగాణ మంత్రి దాసోజు శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం (GIBF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన “ఇండియా–లాటిన్ అమెరికా, కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్” రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మరింత పెట్టుబడులను ఆకర్షించే దిశగా కృషి చేస్తోంది. జాతీయ ఆర్థిక వృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుంది’’ అని తెలిపారు.

తెలంగాణలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) శ్రేణి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రత్యేక పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని విధాలుగా మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.

జహీరాబాద్ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆరు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయని, ఇందులో మూడు కొరియా సంస్థలని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వాతావరణాన్ని ప్రపంచానికి వివరించి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

Read More : కంచ గచ్చిబౌలిలో భూ వేలం ఉపసంహరణపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచన

One thought on “తెలంగాణలో పెట్టుబడులకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి: మంత్రి శ్రీధర్‌బాబు

Comments are closed.