బీజేపీ మండలాధ్యక్షుడిపై POCSO కేసు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బీజాపూర్‌కు చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీజేపీ వెంకటాపురం మండల అధ్యక్షుడు రామెల్ల శేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మిరపకాయల కోతకు కూలి పని కోసం కుటుంబంతో కలిసి బెస్తగూడెం గ్రామానికి వచ్చిన బాలిక నిత్యావసరాల కోసం గ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో బలవంతంగా బండిపై ఎక్కించి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు వెంకటాపురం పోలీసులు స్పందించి, రామెల్ల శేఖర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదనంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసును పోలీసు శాఖ విచారిస్తోంది.

Read More : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో SRH క్రికెటర్ల దర్శనం…