రిలయన్స్ జియో ‘అన్‌లిమిటెడ్ ఆఫర్’ గడువు పొడిగింపు – ఏప్రిల్ 15 వరకు లభ్యం..

దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో అందిస్తున్న ‘జియో అన్‌లిమిటెడ్ ఆఫర్’ గడువును ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించారు. ఈ ఆఫర్‌ను కంపెనీ మార్చి మధ్యలో ప్రకటించింది. మొదట ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉండేది. అయితే, తాజాగా జియో అధికార వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఆఫర్‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు వెల్లడించింది.

జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ వివరాలు:

జియో ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.299 లేదా అంతకు పైగా రీచార్జ్ చేస్తే, జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా 90 రోజులపాటు పొందవచ్చు. దీని ద్వారా యూజర్లు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను మొబైల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Read More : కలలకు హద్దులుండవని నిరూపించిన Jharkhand బాలిక