బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు శ్రద్దా కపూర్ పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ‘స్త్రీ’ చిత్ర విజయం తర్వాత సోలో హీరోయిన్‌గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న శ్రద్దా, ‘స్త్రీ 2’ తో 800 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంది. ఈ విజయంతో ఆమె పారితోషికం రెట్టింపు అయినప్పటికీ, కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలతో కూడా మళ్లీ మళ్లీ వెండితెరపై మెరవుతోంది.
ఇప్పుడు శ్రద్దా కపూర్ తనదైన మార్క్ చూపించేందుకు ‘తుంబాడ్’ దర్శకుడు రాహు అనీల్ బార్వాతో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ లేడీ ఓరియెంటెడ్ కథ, హాలీవుడ్ స్థాయిలో థ్రిల్ కలిగించేలా ఉంటుందని తెలుస్తోంది. కథ వినగానే శ్రద్దా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రాజెక్ట్‌పై నిర్మాణ బాధ్యతలు ఎక్తా కపూర్ తీసుకోగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రం శ్రద్దా కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవబోతుందంటూ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె పారితోషికమే రెండు చిన్న సినిమాల బడ్జెట్‌ను తలపిస్తోందట. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యే దశలో ఉండగా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

One thought on “తుంబాడ్ డైరెక్టర్ తో శ్రద్దా కపూర్.. కొత్త ప్రయోగానికి రెడీ!”
Comments are closed.