ఏప్రిల్ 5న నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన ఎనర్జీ, స్పెషల్ స్టైల్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక, ఈసారి కూడా తన బర్త్‌డేను ఫుల్ జోష్‌తో సెలబ్రేట్ చేస్తోంది. “పుట్టినరోజు నెల వచ్చేసింది… ఎంతో హ్యాపీగా పెరుగుతున్నా. ఈసారి కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండగలిగాను” అంటూ తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా ఫ్యాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకుంది.

తన పుట్టినరోజు సందర్భంగా ఓ హాలిడే ట్రిప్‌కు కూడా ప్లాన్ వేసిన రష్మిక, ఓమన్‌లోని సలాలాలో సన్, సాండ్, స్మైల్స్‌తో సముద్రతీరాన్ని ఆస్వాదించింది. పూల్ పక్కన స్టైలిష్ హ్యాట్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “అద్భుతమైన భోజనం + హ్యాపీ టమ్మీ = కోపంగా ఉన్న ట్రైనర్స్” అంటూ రష్మిక చేసిన ఫన్నీ కామెంట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. సింపుల్ లుక్‌లోనూ క్లాస్ చూపించిన ఈ బ్యూటీ, తన పర్సనల్ లైఫ్‌ను ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తుందో మరోసారి చాటింది.

ప్రస్తుతం రష్మిక టాప్ హీరోయిన్గా పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి సినిమాలతో వరుస విజయాలు సాధించిన ఈ బ్యూటీ, ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘సికందర్’ సినిమాలో కనిపించింది. ఫలితం మిశ్రమంగా ఉన్నా, ఆమె పెర్ఫార్మెన్స్ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ‘చలో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక, ‘గీతగోవిందం’, ‘సీతారామం’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు.

One thought on “హాలిడే జాయ్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసిన రష్మిక మందన్న”
Comments are closed.