సుస్మితకు ఉపాసన నుంచి అరుదైన కానుక!

Upasana Konidela gift to Sushmitha Konidela

సెలబ్రిటీలు ధనవంతులు కావడంతో ఖరీదైన కానుకలు అందించడం సాధారణమే. అయితే విలువలు, సాంప్రదాయాలను ప్రతిబింబించే అరుదైన కానుకలు అందించినప్పుడే అవి అందరికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఉపాసన కామినేని, సుస్మిత కొణిదెలకు అందించిన కానుక కూడా అలాంటిదే. సుస్మితకు “శ్రీరామ పాదాలు” పుస్తకాన్ని బహుకరించారు. ఈ ప్రత్యేక కానుక పట్ల సుస్మిత సోషల్ మీడియాలో తన కృతజ్ఞతలు తెలిపారు. “చరణ్-ఉపాసన.. పార్టీకి అద్భుతమైన హోస్ట్‌లుగా ఉన్నందుకు, చాలా ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు. ఈ బహుమతి మీ ఇద్దరి గురించి చెబుతోంది. సంరక్షణ, తరగతిలో మీరు పాటించే విలువల గురించి చాలా మాట్లాడుతుంది” అని పేర్కొన్నారు.

రామ్ చరణ్ 40వ పుట్టినరోజు వేడుకలను ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉపాసన గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలో సన్నిహిత బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపాసన అందించిన “శ్రీరామ పాదాలు” పుస్తకం, ఆధ్యాత్మిక స్పర్శను కలిగించిన అరుదైన కానుకగా నిలిచింది. ఇది ఖరీదైన కానుక కంటే విలువైనది అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా ఈ కానుక అందరికీ గుర్తుండిపోయేలా చేసింది.

ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం “పెద్ది” సినిమాలో నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టి-సిరీస్ ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను రూ. 25 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, సుస్మిత నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Read More

One thought on “సుస్మితకు ఉపాసన నుంచి అరుదైన కానుక!

Comments are closed.