వెబ్ సిరీస్‌ల నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలు వందల కోట్ల పెట్టుబడులు వెదజల్లుతున్నాయి. ఎన్నో సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందినా, కొన్నిసార్లు అంచనాలు అందుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్ఠాత్మక వెబ్ సిరీస్ “సిటాడెల్ – సీజన్ 1” భారీ నష్టాలను చవిచూసింది. దాదాపు 2560 కోట్ల బడ్జెట్‌తో (300 మిలియన్ డాలర్లు) నిర్మించిన ఈ సిరీస్, 2135 కోట్ల మేర (250 మిలియన్ డాలర్లు) నష్టపోయిందని సమాచారం. అద్భుతమైన నటీనటులతో కూడుకున్నప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం నిర్మాతలకు నిరాశ కలిగించింది.
ఈ భారీ నష్టంతో “సిటాడెల్ – సీజన్ 2” భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ప్రతినిధుల ప్రకారం, రెండో సీజన్‌ను పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించారు. నవంబర్ 2024లో సీజన్ 2 చిత్రీకరణ పూర్తయినప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల 2026కి వాయిదా పడింది. స్పిన్ ఆఫ్ లు కూడా ఆలస్యమవడంతో ఫ్రాంఛైజీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఇక భారతీయ వెర్షన్ విషయానికి వస్తే, రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందిన “సిటాడెల్ – హనీ బన్నీ” మాత్రం అద్భుత విజయం సాధించింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్, అంచనాలను దాటే కథనంతో సితాడెల్ భారత్‌లో విజయం సాధించగా, అంతర్జాతీయ వెర్షన్ మాత్రం నిరాశ పరిచింది.

One thought on “భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌కు భారీ నష్టం”
Comments are closed.