ప్రభాస్, హను రాఘవపూడి కాంబో ఒక్క సినిమాతో ఆగేలా లేదు!

prabhas-hanu-raghavapudi-movies

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “రాజాసాబ్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉండగా, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజీ” అనే భారీ బడ్జెట్‌ సినిమా కూడా ప్రభాస్ చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫౌజీతో పాటు “సలార్ 2”, “కల్కి 2”, “స్పిరిట్”, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా కూడా ప్రభాస్ లైన్‌లో ఉన్నాయి.

ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలో హను చెప్పిన మరో కథకు ప్రభాస్ ఫిదా అయి, ఆ ప్రాజెక్టును కూడా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడైన ఒక నిర్మాత ముందుకు వచ్చాడని సమాచారం. అయితే, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల కారణంగా హను-ప్రభాస్ కాంబినేషన్‌లో కొత్త సినిమా మొదలుకావడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫౌజీ సినిమా ఫలితం తెలియకుండానే ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హను రాఘవపూడి గత చిత్రం “సీతారామం” క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అందుకే ప్రభాస్ ఈయన దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫౌజీ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది. ఆ తర్వాత హను రాఘవపూడి మరో హీరోతో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. మొత్తానికి ప్రభాస్, హను రాఘవపూడి కాంబో ఒకటితో ఆగేలా కనిపించడం లేదు.

Read More

One thought on “ప్రభాస్, హను రాఘవపూడి కాంబో ఒక్క సినిమాతో ఆగేలా లేదు!

Comments are closed.