ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ ప్లాంట్‌కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేతి పెన్నితో జరిగింది.
ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీజ్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠి పాల్గొన్నారు.
475 ఎకరాల్లో రూ.139 కోట్ల పెట్టుబడితో 100 టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇది రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో మొదటి ప్లాంట్‌గా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్టుతో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ సీబీజీ హబ్, రిలయన్స్ దేశంలో ఏర్పాటు చేయనున్న 4 సీబీజీ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుంది. మంత్రి నారా లోకేశ్ ప్లాంట్ ఆవరణలోకి చేరగానే కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, సీఎస్ కె.విజయానంద్, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎమ్. అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Read More : ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చిన్నారి మృతి

One thought on “ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో రిలయన్స్ న్యూ ఎనర్జీ కంపెనీ సీబీజీ ప్లాంట్ ప్రారంభం…”
Comments are closed.