భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణంలో సౌత్ ఇండస్ట్రీలు – మారుతున్న ట్రెండ్

South Indian Big-Budget Movies

సౌత్‌ ఇండియన్‌ సినిమాలు ఇప్పుడు భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణంలో కొత్త మార్గదర్శకాలను స్థాపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ (టాలీవుడ్‌) పేరు ఈ రంగంలో వినిపిస్తూనే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోలతో సినిమా తీస్తే కనీసం ₹250 కోట్ల నుంచి బడ్జెట్‌ ప్రారంభమవుతుంది. కథను బట్టి ఈ సంఖ్య మరింత పెరుగుతూ 300, 500, 600 కోట్లకు చేరుకుంటోంది. ఇక రీజనల్‌ చిత్రాల విషయంలో, టైర్ 2 హీరోలతో చేసే సినిమాలకు కనీసం ₹100 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టలేక కొత్త నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.

తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్‌) కూడా ఇటీవల భారీ బడ్జెట్‌ చిత్రాలపై దృష్టి పెట్టింది. అయితే, ఈ రంగంలో సంచలనం సృష్టిస్తోంది కన్నడ పరిశ్రమ (సాండిల్‌ వుడ్‌). “కేజీఎఫ్‌” సిరీస్‌ విజయం తర్వాత, అక్కడి నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడటం లేదు. “కాంతార 2” చిత్రానికి హోంబలే ఫిల్మ్స్ ఏకంగా ₹200 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తోంది. అలాగే, యశ్‌ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న “టాక్సిక్‌” చిత్రానికి కేవీఎన్- మాన్‌ స్టార్‌ మైండ్‌ క్రియేషన్స్‌ ఏకంగా ₹300 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తోంది. ఇదే విధంగా, ఉపేంద్ర నటించిన “కబ్జా” చిత్రం ₹120 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది.

సాండిల్‌ వుడ్‌ పరిశ్రమకు ఒకప్పుడు ₹20 కోట్ల బడ్జెట్‌ కూడా పెద్దది అనిపించేది. కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌ చిత్రాలకు వెనుకాడకుండా ముందుకు వస్తోంది. ఈ మార్పు పాన్ ఇండియా మార్కెట్‌లో కన్నడ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. సౌత్‌ ఇండియన్‌ చిత్ర పరిశ్రమలు ఇప్పుడు బడ్జెట్ పరంగా సరికొత్త మెరుగులను చేరుకుంటూ, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరిస్తున్నాయి.

Read More

One thought on “భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణంలో సౌత్ ఇండస్ట్రీలు – మారుతున్న ట్రెండ్

Comments are closed.