మళ్లీ కలవనున్న రొమాంటిక్ జంట: ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ బిగ్ స్క్రీన్‌పై తిరిగి కనిపించబోతున్నారు!

Aditya Roy Kapur Shraddha Kapoor New Movie

2013లో వచ్చిన ఆషికీ 2 చిత్రంతో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంట ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు. ఆ సినిమాలో వారి రొమాంటిక్ కెమిస్ట్రీకి అభిమానులు, సినీ వర్గాలు, మీడియా విశేషంగా స్పందించారు. అప్పటినుంచి వీరి జంటలో మరిన్ని సినిమాలు రావాలని ఎంతో మంది కోరుకున్నా, ఆ ఆశ నెరవేరలేదు. అయితే, ఈ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వీరిద్దరు ఒకే చిత్రంలో కనిపించబోతున్నారు.

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మోహిత్ సూరి దర్శకత్వంలో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది, అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. శ్రద్ధా కపూర్ ఇటీవల అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన స్త్రీ 2 విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆ చిత్రంలో ఆమె నటనకు విశేషంగా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఉంది. ఆ తరువాత సినిమాల ఎంపికలో శ్రద్ధా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

మరోవైపు ఆదిత్య రాయ్ కపూర్ కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. మెట్రో ఇన్ డినో చిత్రంతో పాటు, సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత మళ్లీ శ్రద్ధా కపూర్‌తో రొమాంటిక్ డ్రామాకు సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్‌లో వరుస ఫ్లాపులు నడుస్తున్న నేపథ్యంలో ఈ జంట మళ్లీ కలవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఆదిత్య రాయ్ కపూర్‌కు ఒక భారీ హిట్ ఎంతో అవసరం. ఆషికీ 2 స్థాయిలో మరో మేజిక్ రిపీట్ అవుతుందా? చూడాలి!

Read More

One thought on “మళ్లీ కలవనున్న రొమాంటిక్ జంట: ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ బిగ్ స్క్రీన్‌పై తిరిగి కనిపించబోతున్నారు!

Comments are closed.