‘మహానటి’ సినిమాతో టాలీవుడ్‌లో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ ప్రస్తుతం కోలీవుడ్ మరియు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహానటి తర్వాత టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలు పెద్ద విజయాలను సాధించలేకపోయాయి. ఈమె చివరిగా తెలుగులో దసరా సినిమాకు హీరోయిన్‌గా నటించింది. నానితో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినప్పటికీ, కీర్తి సురేష్‌కి టాలీవుడ్ నుంచి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం దక్కడం లేదు.
కొన్ని చిన్న సినిమాలకు ఛాన్స్ వచ్చినా, కీర్తి అవి సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. సినీ విశ్లేషకుల ప్రకారం, స్టార్ హీరోలు కీర్తిని టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిగణించటం లేదని తెలుస్తోంది. అయితే, కీర్తి సురేష్ కోలీవుడ్‌లో మాత్రం మోస్ట్ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం, మరిన్ని ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయి. పెళ్లి తరువాత కూడా కోలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కీర్తి, తమిళ స్టార్ హీరోలతో జోడీగా నటించే అవకాశాలను సొంతం చేసుకుంటుంది.
మరొకవైపు, బాలీవుడ్‌లోనూ ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్లు తగ్గాయని భావించడంతో, కీర్తి వెంటనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో రాధిక ఆప్టేతో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో కీర్తి సురేష్ మరోసారి మంచి అవకాశాలు గెలుచుకుంటోంది. రణబీర్ కపూర్‌తో నటించే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఆమె హిందీ కమర్షియల్ సినిమాల పట్ల ఆసక్తి చూపకపోవడం, స్కిన్ షో చేయకపోవడం, రొమాంటిక్ సీన్స్ చేయకపోవడం అనే కారణాల వల్ల బాలీవుడ్‌లో ఆమె భవిష్యత్‌ను కొందరు ప్రశ్నించారు. కానీ కీర్తి సురేష్ నిరంతర ప్రయత్నాలతో ఇప్పటికీ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ స్థానం ఏర్పరుచుకుంది. రాబోయే కాలంలో కీర్తి బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయడం అనేది ఖాయమైనదిగా భావిస్తున్నారు.

One thought on “టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్, బాలీవుడ్‌లో బిజీ!”
Comments are closed.