దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఇతర వ్యోమగామి బుచ్ విల్మోర్, ఇటీవల భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు. నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వీరు తమ అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు.
అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందనడే ప్రశ్నకు సునీతా విలియమ్స్ “చాలా అద్భుతంగా కనిపించిందని” సమాధానం ఇచ్చారు. తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత పేర్కొన్నారు.
భారత్ గురించి మాట్లాడుతూ, తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే సందర్శించాలనుకుంటున్నట్లు తెలిపారు. భారతదేశం గురించి తన అనుభవాలను బంధువులు మరియు ప్రజలతో పంచుకోవాలని ఆసక్తి వ్యక్తం చేశారు. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా, అంతరిక్ష రంగంలో కూడా విజయాలు సాధిస్తున్న దేశంగా సునీత అభిప్రాయపడ్డారు. “భారత్ మూలాలు నా లోపల ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉంది” అని ఆమె చెప్పారు.
Read More : మహారాష్ట్రలో ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి:

One thought on “భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష అనుభవాలను పంచుకున్నారు…”
Comments are closed.