హిందీ సినిమా వినాశ‌నం వెన‌క అస‌లు కార‌ణం? షబానా ఆజ్మీ అభిప్రాయం

Bollywood decline reasons

ఇటీవ‌ల బాలీవుడ్‌లో సినిమాల వినాశ‌నం పై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. స‌రైన క‌థ‌లు లేక‌, రీమేక్‌ల‌పై ఆధార‌ప‌డుతున్న బాలీవుడ్ ప్ర‌స్తుత ద‌శను సీనియ‌ర్ న‌టి షబానా ఆజ్మీ స్ప‌ష్ఠంగా చ‌ర్చించారు. ఆమె అభిప్రాయం ప్రకారం, బాలీవుడ్‌లో సృజనాత్మ‌కత, నూతన క‌థ‌ల‌కు వ‌స్తున్న కొరత వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. స్తంభాలు సరైన స్థలంలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోకుండా ఇంటి అలంకరణ ప్రారంభించడం కరెక్టు కాదు. నిర్మాణం సరిగ్గా లేకపోతే అలంకరణతో ఏం చేయగలము? అని షబానా ప్రశ్నించారు.

షబానా అజ్మీ మాట్లాడుతూ, బాలీవుడ్ ప్రస్తుతం 'పరివర్తన దశ'లో ఉంది. సాంకేతికంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు చిత్రనిర్మాతలకు సహాయం చేస్తున్నా, కానీ వాటి వల్ల కూడా ప్రతికూలతలు కలుగుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం అనుకూలమైనప్పటికీ, అక్కడ ప్రభావవంతమైన కంటెంట్ కొరత కూడా ఉందని, నేటి సినిమాలు ఓటీటీలపై ఆధారపడుతున్నాయి, అన్నారు.

ఇది ఓ పెద్ద సమస్యగా ఎదిగిందని ఆమె అంగీకరించారు. సినిమాలో పాట‌లు, డైలాగులు బాగున్నా, క‌థ లేక‌పోతే అది పునాది లేని భ‌వంతి లాంటిది. ఆలోచనకు ఆహారం ఉండాలి! కంటెంట్ ఎప్పుడూ కింగ్, క‌థ చెప్పడంలో జాగ్రత్త అవసరం, అని షబానా చెప్పారు. ఆమె మాటల్లో, చిత్రపరిశ్రమలో సరికొత్త మార్పులు రావాలనుకుంటున్నాం కానీ, ముందుగా సక్రమమైన కథలను ఎంపిక చేయడం అవసరం.

Read More

One thought on “హిందీ సినిమా వినాశ‌నం వెన‌క అస‌లు కార‌ణం? షబానా ఆజ్మీ అభిప్రాయం

Comments are closed.