చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్, మసూద సినిమాతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మంచి ఫలితం అందుకుంది. బలగం సినిమాతో హిట్ సాధించిన కావ్య, ఆ తరువాత కొన్ని ప్రాజెక్టులలో కనిపించినా, పెద్దగా అవకాశాలు దక్కలేదు.

చలనచిత్రాల్లో అవకాశాలు తగ్గినా, కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. ప్రత్యేకించి ఆమె శారీ లుక్ ఫోటోషూట్స్‌కు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఫోటోషూట్స్‌కు కావ్య చూపిస్తున్న డెడికేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఫోటోషూట్స్‌తో ఆకర్షణ పొందినప్పటికీ, సినిమాల విషయంలో మాత్రం కావ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏదిపడితే ఆ సినిమా చేయకుండా, మంచి కథల కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వరుసగా సినిమాలు చేయడం లేదని సమాచారం.

కావ్య కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తెరపై ఆమెని ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

One thought on “ఫోటోషూట్స్‌తో దుమ్మురేపుతున్న బలగం భామ!”
Comments are closed.