బాలీవుడ్‌లోనూ రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఆర్య 2 – అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ కోసం భారీ ప్లాన్

Arya 2 Re-Release

2009లో విడుదలైన “ఆర్య 2” సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సూపర్‌హిట్‌ మూవీని ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా 4K రిజల్యూషన్, సరికొత్త సౌండ్ టెక్నాలజీతో తెలుగు, హిందీ భాషల్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ నటించిన “ఆదిత్య 369” రీ రిలీజ్‌కి రెడీ అవుతుండగా, ఆ సినిమా వచ్చిన వారం రోజుల గ్యాప్‌లోనే “ఆర్య 2″ను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

పుష్ప 2తో నార్త్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించిన అల్లు అర్జున్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని “ఆర్య 2″ను హిందీలోనూ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బుల్లితెర, యూట్యూబ్ ద్వారా హిందీ ప్రేక్షకులకు “ఆర్య 2” ఇప్పటికే పరిచయం అయినప్పటికీ, పెద్ద తెరపై కొత్త అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ముందుకెళుతున్నారు. బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యాపారపరంగా మంచి ఆలోచనగా భావిస్తున్నాయి. రీ రిలీజ్ ద్వారా హిందీ మార్కెట్‌లో కూడా మరింత పాపులారిటీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం కానుంది. “ఆర్య 2” రీ రిలీజ్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండగగా ఉండనుంది. రీ రిలీజ్ హైప్‌ మరియు పుష్ప ఫ్యాన్ బేస్‌ను ఉపయోగించుకుని భారీ వసూళ్లను సాధించేందుకు మేకర్స్ ఆశాభావంతో ఉన్నారు.

Read More

One thought on “బాలీవుడ్‌లోనూ రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఆర్య 2 – అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ కోసం భారీ ప్లాన్

Comments are closed.