ఎక్స్ (ట్విట్టర్)ను తన XAI స్టార్టప్‌కు విక్రయించిన ఎలాన్ మస్క్

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్)ను తన (ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్టార్టప్‌కు విక్రయించారు. ఈ భారీ ఒప్పందం విలువ 33 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.

మస్క్ ప్రకారం, XAI మరియు ఎక్స్ భవిష్యత్తులు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని, అందుకే ఈ రెండు సంస్థల డేటా, మోడల్స్, కంప్యూటింగ్ శక్తి, డిస్ట్రిబ్యూషన్ మరియు టాలెంట్‌ను ఒకే స్థాయిలో తీసుకువెళ్లేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఒకీకరణతో XAI మరింత బలంగా ఎదగనుందని, వినియోగదారులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

One thought on “ఎక్స్ (ట్విట్టర్)ను తన XAI స్టార్టప్‌కు విక్రయించిన ఎలాన్ మస్క్

Comments are closed.