రీసెంట్‌గా విడుదలైన “ఎల్2: ఎంపురాన్” సినిమాతో మోహన్‌లాల్ ఘన విజయాన్ని సాధించారు. విడుదలైన వెంటనే ఈ మలయాళ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ విజయోత్సాహంలో ఉన్న మోహన్‌లాల్, రిషబ్ శెట్టి “కాంతార ఛాప్టర్ 1″లో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, “ఎంపురాన్” ప్రమోషన్స్ సందర్భంగా మోహన్‌లాల్ ఈ రూమర్స్ పై ఆసక్తికరంగా స్పందించారు.
“నన్ను ‘కాంతార 2’లో పెట్టండి. నాకు ఒక రోల్ ఇవ్వండి. నేను అంత చెడ్డ నటుడిని కాదనుకుంటా. మోహన్‌లాల్ ‘కాంతార ఛాప్టర్ 1’లో నటించాలనుకుంటున్నాడు” అని సరదాగా పేర్కొన్నారు. ఈ కామెంట్ తో అభిమానుల్లో మరింత ఉత్సాహం రేకెత్తింది. 2022లో జాతీయ అవార్డు గెలుచుకున్న “కాంతార” సినిమాకి ఇది ప్రీక్వెల్ కావడంతో, అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, రిషబ్ శెట్టి “ఛత్రపతి శివాజీ మహారాజ్”, “జై హనుమాన్” వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక, “కాంతార ఛాప్టర్ 1” షూటింగ్ ప్రదేశంలో పెద్ద ఎత్తున బాంబుల వినియోగం కారణంగా అడవి ప్రాంతం నాశనం అయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. ఒకవైపు మోహన్‌లాల్ “ఎల్2″తో హిట్ కొడితే, మరోవైపు మమ్ముట్టి, నయనతారలతో ఒక ప్రాజెక్ట్ లో కలిసి పనిచేసే అవకాశం ఉందని సమాచారం. అదనంగా, ప్రియదర్శన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి.

One thought on “మోహన్‌లాల్ “కాంతార ఛాప్టర్ 1″లో నటిస్తున్నారా? నటుడి క్లారిటీ!”
Comments are closed.