కేఎల్ రాహుల్-ఆతియా శెట్టి దంపతులకు కూతురు పుట్టింది

athiya shetty and kl rahul

స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి ఆతియా శెట్టి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ జంట తమ మొదటి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటూ, రెండు హంసల పెయింటింగ్‌ను షేర్ చేశారు.

“ఆడపిల్లతో ఆశీర్వాదం అందుకున్నాం” అని మెసేజ్ జోడించారు. ఈ సోమవారం (2025, మార్చి 24) చిన్నారి పుట్టినట్టు వెల్లడించారు.

నటుడు సునీల్ శెట్టి కుమార్తె ఆతియా, కెఎల్ రాహుల్‌లు తమ ఆనందాన్ని హాలో, రెక్కల ఎమోజీతో సూచించారు. పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “మీ చిన్నారి జీవితం ప్రేమ, ఆనందంతో నిండిపోవాలి” అంటూ హృదయపూర్వక సందేశాలు పంపించారు. గత సంవత్సరం నవంబర్‌లో ఈ జంట తమ మొదటి బిడ్డ రాబోతోందని ప్రకటించగా, ఆతియా బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కెఎల్ రాహుల్, ఆతియా శెట్టి 2019లో ఓ మ్యూచవల ఫ్రెండ్ ద్వారా కలిశారు. మొదటి మీట్ లోనే కనెక్ట్ అయిన ఈ జంట, క్రమంగా తమ రిలేషన్‌ను కొనసాగించారు. అనేక సంవత్సరాల డేటింగ్ తర్వాత 2023లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రత్యేక వేడుక సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగింది. ఇప్పుడు పాప పుట్టడంతో వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

Read More

One thought on “కేఎల్ రాహుల్-ఆతియా శెట్టి దంపతులకు కూతురు పుట్టింది

Comments are closed.