హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో అవాంతరం: సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం, వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం

యూకేలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం హీత్రో (Heathrow Airport) భారీ అవాంతరాన్ని ఎదురుకుంది. ఈ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో విమానాశ్రయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రాకపోకలకు తీవ్ర సమస్యలు తలెత్తాయి. భద్రతా కారణాల దృష్ట్యా హీత్రో ఎయిర్‌పోర్ట్ తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో హీత్రో వైపు వస్తున్న దాదాపు 120 విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయ్యేందుకు ఇతర మార్గాలను అన్వేషించాయి. ఈ మూత ప్రభావం 1,351 విమానాల పై పడింది. హీత్రో ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరే, అక్కడ ల్యాండ్ అయ్యే ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

అధికారులు ఈ సమస్యను పరిష్కరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. అయితే, విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నాయి. హీత్రో ఎయిర్‌పోర్ట్ సేవలు ఎప్పుడు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడతాయనే దానిపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Read More : “సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు తక్కువ వేతనం.. నాసాపై విమర్శల వెల్లువ”

One thought on “హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో అవాంతరం: సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం, వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం

Comments are closed.