తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం, వడ్డీ చెల్లింపులు, ఆదాయ వనరులు – ఇవన్నీ ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతూనే ఉంటాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారిన ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. రాష్ట్రం అడ్డగోలు అప్పుల బారిన పడిందని, హద్దులేని వడ్డీలతో ప్రభుత్వ ఖజానా దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో అప్పుల భారమే – కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడతనే ప్రభుత్వం నూతన అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలనను నిలబెట్టుకునేందుకు, ఆర్థిక స్థిరీకరణ కోసం అప్పులు తీయాల్సిన అవసరం ఉందని రేవంత్ తెలిపారు. అయితే, గతంలో తీసుకున్న లెక్కలేనన్ని అప్పులు, అధిక వడ్డీ భారం వల్ల ఖజానా ఖాళీ అయిందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఎక్కడా అప్పు దొరకడం లేదని, కనీసం ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా నిధుల లేమి ఉందని వెల్లడించారు.
అప్పులపై రాజకీయ దాడులకు రేవంత్ కౌంటర్
కాంగ్రెస్ హయాంలో ఒక్క హామీ కూడా అమలు కాలేదని విపక్షాలు ఆరోపిస్తుండగా, రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘కొంత వెసులుబాటు ఇవ్వండి.. అన్నీ సెట్ చేస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా, అప్పులపై అధిక వడ్డీ భారం వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని, ఇప్పుడు 11% వడ్డీ రేటును 4-5% శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ పరిణామాలతో, రాష్ట్రంలో అప్పులపై, ఆర్థిక స్థితిగతులపై అధికార, విపక్షాల మధ్య మరోసారి వేడెక్కిన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది.

One thought on “తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ కొత్త ట్విస్ట్ – పాలనపై విమర్శలకు కౌంటర్”
Comments are closed.