భారత ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్తగా కఠినమైన మోటార్ వెహికల్ జరిమానాలను అమలు చేయనుంది. రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. నూతన నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించనున్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వీటిలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం, సీట్‌బెల్ట్ లేకుండా కారు నడిపించడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం లాంటి కేసుల్లో భారీగా జరిమానాలు విధించేలా నూతన నిబంధనలు రూపొందించినట్టు అధికారులు తెలిపారు. జనాభా భద్రత దృష్ట్యా కొత్త నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.


One thought on “మార్చి 1 నుంచి కొత్త మోటార్ వెహికల్ జరిమానాలు అమల్లోకి”
Comments are closed.