ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమాతో పాటు ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే హీరోయిన్‌గా ఇమాన్వి ఎంపికైనప్పటికీ, సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని, ఆ కోసం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ ను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సినిమాలో యువరాణి అనే కీలక గెస్ట్ రోల్ కోసం ఆలియాను తీసుకోవాలని మేకర్స్ యోచిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర 20-30 నిమిషాలు మాత్రమే ఉండే గెస్ట్ రోల్ అయినప్పటికీ, కథలో దాని ప్రాధాన్యం ఎక్కువట. ఆలియాకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు, మరో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కూడా సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్-టాలీవుడ్ కలయికతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుతుంది.
ప్రభాస్ కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంగా ‘ఫౌజీ’ నిలవనుండగా, ఆలియా భట్ చేరితే ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

One thought on “ప్రభాస్ ‘ఫౌజీ’లో మరో హీరోయిన్?”
Comments are closed.