సిక్కింలో పర్యాటకులకు కొత్త నిబంధన: మార్చి 2025 నుంచి ప్రవేశ రుసుము విధింపు

SIKKIM GOVERNMENT

సిక్కిం ప్రభుత్వము పర్యాటక అభివృద్ధి నిధి (Tourism Sustainability Development Fund) కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మార్చి 2025 నుండి సిక్కింలోకి వచ్చే ప్రతి పర్యాటకుడి నుండి రూ.50 ప్రవేశ రుసుమును వసూలు చేయాలని నిర్ణయించింది.

ఈ రుసుమును పర్యాటకులు హోటల్‌ చెక్-ఇన్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. హోటళ్ల యాజమాన్యం ఈ రుసుమును సేకరించి ప్రభుత్వానికి అందజేస్తుంది. సేకరించిన నిధులను పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం వినియోగించనున్నారు.

అయితే, ఐదేళ్ల లోపు చిన్నపిల్లలు ఈ రుసుము నుంచి మినహాయింపునకు అర్హులని ప్రభుత్వం వెల్లడించింది. సిక్కింలో పర్యాటక ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ కొత్త రుసుము విధింపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.

Read More

One thought on “సిక్కింలో పర్యాటకులకు కొత్త నిబంధన: మార్చి 2025 నుంచి ప్రవేశ రుసుము విధింపు

Comments are closed.