స్టార్టప్‌లపై తన వ్యాఖ్యల గురించి వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. భారత స్టార్టప్‌లపై తాను చేసిన వ్యాఖ్యలపై సానుకూల స్పందన వచ్చిందని ఆయన తెలిపారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలే అనవసరంగా ఈ అంశాన్ని వివాదంగా మలుస్తున్నాయని గోయల్ ఆరోపించారు.
తన సందేశాన్ని తప్పుడు దృక్పథంతో ప్రజలకు చేరవేస్తూ, స్టార్టప్‌లను దారి తప్పిస్తున్నారని పీయూష్ గోయల్ మండిపడ్డారు. కాంగ్రెస్ కావాలనే వక్రీకరణకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
Read More : ఖండ్వాలో బావిలో విషవాయువులతో ఎనిమిది మంది గ్రామస్తుల మృతి.
