‘కోర్ట్’ & ‘దిల్ రూబా’ ఓటీటీ వివరాలు – ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

court-dilruba-movie-ott-streaming-details

ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకున్న రెండు ఆసక్తికరమైన చిత్రాలు ‘కోర్ట్’ మరియు ‘దిల్ రూబా’. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై రూపొందింది. మరోవైపు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘దిల్ రూబా’ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘కోర్ట్’ – నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

సమాజంలో సంచలనంగా మారిన పోక్సో చట్టం మరియు దాని లొసుగులను వాడుకొని అమాయకులను ఇబ్బందులలోకి నెడుతున్న పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్రం మార్చి 14న విడుదలై, భారీ స్పందన పొందింది. సినిమా విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ కొనుగోలు చేసింది. థియేటర్లలో నాలుగు వారాల రన్ పూర్తి చేసిన అనంతరం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

‘దిల్ రూబా’ – ఆహా లో స్ట్రీమింగ్

కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘దిల్ రూబా’ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించగా, నజియా కీలక పాత్రలో నటించింది.

ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ కొనుగోలు చేసింది. థియేటర్లలో నాలుగు వారాల రన్‌ అనంతరం ‘దిల్ రూబా’ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Read More

One thought on “‘కోర్ట్’ & ‘దిల్ రూబా’ ఓటీటీ వివరాలు – ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

Comments are closed.