హెడ్మాస్టర్‌ను అభినందించిన మంత్రి లోకేష్

Nara-Lokes-

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓ హెడ్మాస్టర్ చేసిన వినూత్న ప్రయత్నం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి విభిన్న పద్ధతిని అవలంభించారు.

పిల్లలు చదువులో వెనుకబడి, చెప్పిన మాట వినకపోవడాన్ని చూసిన హెడ్మాస్టర్ చింత రమణ వారికి శిక్ష విధించేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులను మందలించకుండా, వారిని సమక్షంలో తన గుంజీలు తీయించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లోకేష్ ప్రశంసలు:
ఈ వీడియోపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందిస్తూ హెడ్మాస్టర్ చింత రమణను అభినందించారు. “హెడ్మాస్టరుగారూ! మీ ఆలోచన బాగుంది. విద్యార్థులను మందలించకుండా, వారి ఎదుగుదలకు ప్రోత్సాహం కల్పించాలనే మీ కృషి ప్రశంసనీయమని” మంత్రి పేర్కొన్నారు. “అంతా కలిసి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గొప్ప విజయాలు సాధించగలరు,” అని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి హెడ్మాస్టర్ చూపిన ఈ కొత్త మార్గం పాఠశాలల్లో ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి:
హెడ్మాస్టర్ చింత రమణను ఆదర్శంగా తీసుకుని, పిల్లల విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. విద్యార్థుల అభ్యాసంలో మెరుగుదల కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారమయం కావాలంటే అందరం కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

Read More