“ఫిల్లర్స్ వల్ల జోకర్‌లా కనిపించాను”– మహీప్ కపూర్ మహిళలకు కీలక సూచనలు!

Maheep kapoor

సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ షో ‘ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ షో మొదటి సీజన్ 2020లో విడుదల కాగా, రెండో సీజన్‌కు ముందు ఆమె ఫిల్లర్స్ చేయించుకున్న సంగతి తాజాగా బయటపడింది.

ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహీప్ కపూర్, ఈ షో గురించి, తన అనుభవాల గురించి మాట్లాడారు. షోను తెరకెక్కించనున్నట్టు కరణ్ జోహార్ చెప్పినప్పుడు తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు. అయితే, పిల్లల అంగీకారంతో చివరికి ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నానని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా, కెమెరా ముందు ఉండటం వల్ల ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ఆమె మాట్లాడారు. మొదటి సీజన్‌లో తన లుక్ చాలా సహజంగా కనిపించినప్పటికీ, రెండో సీజన్‌కి ముందు ఫిల్లర్స్ చేయించుకున్నానని చెప్పింది. అయితే, ఫిల్లర్స్ తన ముఖానికి సరిపోలేదని, తనను “జోకర్”లా మార్చేశాయని చెప్పారు. అవి పూర్తిగా కరిగిపోవడానికి వేచి చూడాల్సి వచ్చిందని, ఇకపై మళ్లీ ఫిల్లర్స్ చేయించుకోనని స్పష్టం చేశారు.

అలాగే, బోటాక్స్ తనకు బాగా నచ్చిందని, అది ముఖాన్ని రిఫ్రెష్ చేయడానికి ఉపయోగపడుతుందని, అయితే ఫిల్లర్స్ మాత్రం ముఖాన్ని గాల్లో నింపిన బెలూన్‌లా మారుస్తాయని అభిప్రాయపడ్డారు.

ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ మూడో సీజన్ 2024లో విడుదల కాగా, ఈ షోలో సీమ కిరణ్ సజ్దే, నీలమ్ కొఠారి, భావన పాండే వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Read More

One thought on ““ఫిల్లర్స్ వల్ల జోకర్‌లా కనిపించాను”– మహీప్ కపూర్ మహిళలకు కీలక సూచనలు!

Comments are closed.