అసెంబ్లీకి ముందుగానే చేరిన కేసీఆర్.. హాట్ హాట్‌గా మారనున్న బడ్జెట్ సెషన్

KCR

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీకి 50 నిమిషాల ముందుగానే హాజరయ్యారు. గతంలో పలు విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్, ఈసారి అసెంబ్లీకి హాజరై ప్రత్యక్షంగా చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

అసెంబ్లీలోకి వచ్చిన అనంతరం కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే, కేసీఆర్ ముందుగానే హాజరైనా కొందరు బీఆర్‌ఎస్ సభ్యులు సమయానికి అసెంబ్లీకి రాకపోవడం గమనార్హం.

ఇక ఇదే సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఆదినారాయణ బీఆర్‌ఎస్‌లో సభ్యుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, “ఆదినారాయణ బీఆర్‌ఎస్ ప్రోడక్ట్ కావడంతో సరైన సమాధానం ఇచ్చారు” అంటూ టీజ్ చేశారు.

సమావేశం సందర్భంగా బడ్జెట్ సెషన్‌లో కీలక చర్చలు జరిగే అవకాశముందని, రాజకీయం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Read More

One thought on “అసెంబ్లీకి ముందుగానే చేరిన కేసీఆర్.. హాట్ హాట్‌గా మారనున్న బడ్జెట్ సెషన్

Comments are closed.