అంగూర్ బాయిపై పీడీ యాక్ట్ నమోదు

angur-bai-pd-act

గంజాయి వ్యాపారంలో నిమగ్నమైన మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అంగూర్ బాయిపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీడీ యాక్ట్‌ను విధించారు. ఎక్సైజ్ శాఖ సిఫార్సు మేరకు ఈ కఠిన చర్య తీసుకోబడింది.

తెలంగాణలోని దూల్పేట్ ప్రాంతంలో స్థిరపడి గంజాయి వ్యాపారం చేస్తూ, పలుమార్లు అరెస్ట్ అయినా బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి నేరాలలో పాల్గొంటూ ఉన్న అంగూర్ బాయిపై కఠిన చర్యలు అవసరమని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమల్ హాసన్ రెడ్డి సూచించారు.

ఈ మేరకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, దూల్పేట్ ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి ప్రతిపాదించిన పీడీ యాక్ట్‌కు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఆమోదం తెలిపారు. అనంతరం దూల్పేట్ సీఐ మధుబాబు చంచల్ గూడ జైలులో ఉన్న అంగూర్ బాయికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేశారు.

గంజాయి అమ్మకానికి సంబంధించి అంగూర్ బాయిపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 కేసులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో, మరో 10 కేసులు సివిల్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. పలు మార్లు అరెస్ట్ అయినా, తిరిగి బెయిల్‌పై విడుదలై గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండడంతో ఈ కఠిన చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read More

One thought on “అంగూర్ బాయిపై పీడీ యాక్ట్ నమోదు

Comments are closed.