సినిమాలో పాటలు హిట్ అయితే, సినిమాకి సగం విజయమని చెబుతారు. కానీ, కొన్ని సందర్భాల్లో సినిమా హిట్ అయితేనే పాటలు కూడా గుర్తింపు పొందుతాయి. రాజమౌళి – కీరవాణి సినిమాల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
తెలుగులో అనేకమంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా, ఇతర భాషల సంగీత దర్శకులను ఎక్కువగా ఎంచుకోవడం మేకర్స్ అభిరుచి గా మారింది. సామ్ సి.ఎస్., అజనీష్ లోకనాథ్లకు పాటల పరంగా పెద్దగా గుర్తింపు లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు లియోన్ జేమ్స్ కూడా తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.
లియోన్ జేమ్స్ ‘నెక్స్ట్ ఏంటి?’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘లైలా’, ‘మజాకా’ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అయితే, ‘గుండెల్లోనా’ (ఓరి దేవుడా), ‘ఆల్మోస్ట్ పడిపోయానే’ (దాస్ కా ధమ్కీ) తప్పించి, అతని మ్యూజిక్ పెద్దగా గుర్తింపు పొందలేదు. ముఖ్యంగా, ‘మజాకా’ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా, మేకర్స్ ఇతర భాషల టెక్నీషియన్లపై ఆసక్తి చూపుతున్నారు. లియోన్ జేమ్స్‌కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తూ, కొత్త సినిమాలకు తీసుకోవాలని చూస్తున్నారు. “దూరపు కొండలు నునుపు” అనే సామెత గుర్తొచ్చేలా ఉంది. మన టాలెంట్‌ను మనమే ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది!

One thought on “తెలుగు సినిమాల్లో ఇతర భాషల మ్యూజిక్ డైరెక్టర్ల ప్రభావం”
Comments are closed.