హైదరాబాద్‌లో అకస్మాత్తుగా మారిన వాతావరణం

హైదరాబాద్, ఆగస్టు 4: భాగ్యనగరం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం మొదలవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

వాతావరణ శాఖ అధికారులు మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూడా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Read More : తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో-చైర్మన్‌గా ఉపాసన