రోహిత్ శర్మ: మాట తప్పిన రోహిత్.. కెప్టెన్ అని నమ్మితే నిండా ముంచాడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట ఇస్తే సాధారణంగా దాన్ని నిలబెట్టడంలోనే అనుభవం కలవాడు. ఒకసారి చెప్పిన మాట వందసార్లు చెప్పినట్టే అని అనిపించే స్థాయిలో భరోసా ఇస్తాడు. అయితే ఈ సారి రోహిత్ తన మాట తప్పడం మాత్రం క్రికెట్ ప్రేమికులకు తీవ్ర నిరాశను కలిగించింది.
మాట ఇచ్చి వెనక్కు తగ్గాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్‌కు రోహిత్ దూరంగా ఉన్నాడు. కొడుకు పుట్టడం కారణంగా పెర్త్ టెస్ట్ మిస్ అయిన రోహిత్, రెండో టెస్ట్ నుంచి జట్టులోకి వచ్చాడు. అప్పట్లో రాహుల్-జైస్వాల్ జోడీ ఓపెనింగ్‌లో మెరిపించింది. ఆ సమయంలో రోహిత్ తన మాట ఇచ్చాడు, “ఈ ఓపెనింగ్ జోడీని కదిలించబోను. నేను మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాను,” అని స్పష్టంగా చెప్పాడు. రెండో, మూడో టెస్టుల్లో దీనిని పాటించినా, బాక్సింగ్ డే టెస్ట్‌లో మాత్రం తన మాటను మార్చేశాడు.
తన మాట నిలబెట్టకపోవడం వల్ల..
జైస్వాల్-రాహుల్ ఓపెనింగ్ జోడీ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ, రోహిత్ తన స్థానం మార్చి స్వయంగా ఓపెనర్‌గా దిగాడు. కానీ, ఈ నిర్ణయం అతని అనుకూలంగా మారలేదు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 బంతుల్లోనే రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. ప్యాట్ కమిన్స్ వేసిన బౌలింగ్‌లో రోహిత్ చెత్త షాట్ ఆడి ఔట్ కావడం నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది.
కెప్టెన్‌తొ విఫలం..
సిరీస్ మొత్తం రోహిత్ ప్రదర్శన తీవ్ర నిరాశ కలిగించింది. కమిన్స్‌తో తలపడడంలో తడబాటు, పట్టుదల లేకపోవడం, ఫెయిల్ అవుతూ జట్టుపై ఒత్తిడి పెంచడం వంటి విమర్శలు అతనిపై వెల్లువెత్తాయి. నైట్‌వాచ్‌మన్ ఆకాశ్‌దీప్‌ను పంపిన తీరు, తర్వాత అతడిని ఓపెనర్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలు జట్టును మరింత కుదిపేశాయి.
రోహిత్‌పై నెటిజన్ల ఆగ్రహం
నెటిజన్ల అభిప్రాయం ప్రకారం, రోహిత్ అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం, జట్టు విజయానికి ఆటంకం కలిగించడం జట్టును ప్రమాదంలోకి నెట్టింది. తన స్థానం మార్చిన నిర్ణయం జట్టు ప్రదర్శనపై తీవ్రమైన ప్రభావం చూపించింది.
రెండు, మూడు మంచి ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాల్సిన రోహిత్, ఈ సారి మాత్రం తన భాద్యతను సరిగా నిర్వర్తించలేకపోయాడని స్పష్టమవుతోంది.
