ప్రత్యర్థి కి లొంగిపోయావ్…..రోహిత్ శర్మని కెప్టెన్స్ ని విమర్శించిన రవిశాస్త్రి

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో పింక్ బాల్ టెస్టులో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ, సారథిగానూ విఫలమయ్యాడని పలువురు అభిప్రాయపడ్డారు.

జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి రోహిత్ సారథ్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అతడు మరింత దూకుడుగా ఉండాలని సూచించారు. రోహిత్ ఓపెనింగ్‌లో ఆడాలని, జట్టు తక్షణమే పుంజుకోవాలని, ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు స్ట్రాటజీ మెరుగుపరచుకోవాలని సూచించారు.

ఇక బ్యాటింగ్ ఆర్డర్ పునర్వ్యవస్థపరిచి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌కు, రోహిత్ ఓపెనింగ్‌కు రావాలని సూచించారు. ఐదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే మిగతా మూడు టెస్టులు గెలవాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి స్పష్టంచేశారు.