కాశీలో శివశక్తి: తండేల్‌ నుంచి తొలి పాట విడుదల

కాశీలో శివశక్తి

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించగా, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ నెల 22న కాశీలో ‘తండేల్’ నుంచి శివశక్తి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జాతర నేపథ్యంలో సాగనున్న ఈ గీతానికి ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో నాగచైతన్య, సాయిపల్లవి శివ పార్వతుల నాట్య భంగిమలో కనువిందు చేశారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.