ఈసీ అప్రమత్తం: ఎన్నికల ప్రచారంలో ఏఐ వినియోగంపై నియంత్రణ
న్యూఢిల్లీ, జనవరి 16: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) జాగ్రత్తలు తీసుకుంది. ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియోలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించిన ఈసీ, ఈ అంశంపై పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని అభిప్రాయపడింది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియోలపై “ఏఐ జనరేటెడ్”, “డిజిటల్లీ ఎన్‌హ్యాన్స్‌డ్”, “సింథటిక్ కంటెంట్” అనే లేబుల్స్‌ను స్పష్టంగా ముద్రించాల్సిందిగా సూచనలు చేసింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఈ కంటెంట్‌ను ఉపయోగించే ముందు హెచ్చరికలు ఇవ్వాలని కూడా ఆదేశించింది.
ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒక అడ్వయిజరీ పంపిన ఈసీ, ప్రచార కంటెంట్‌లో ఏఐ వినియోగం వల్ల పౌరులపై తప్పుడు సమాచార ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
READ THIS ALSO:

One thought on “ఎన్నికల ప్రచారంలో ఏఐ వినియోగంపై ఈసీ నియంత్రణలు”
Comments are closed.