అవసరమైతే చచ్చిపోతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ: ‘‘ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కుంటాం. న్యాయస్థానాలపై, చట్టాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కేసీఆర్ రక్తాన్ని పంచుకున్న బిడ్డగా చెబుతున్నా, తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణాలు కోల్పోతా కానీ ఎట్టి పరిస్థితుల్లో తలవంచే ప్రసక్తే లేదు’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కేసు
హైదరాబాద్, జనవరి 9: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. నందినగర్‌లోని తన నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఫార్ములా ఈ కేసులో నేను ఎలాంటి క్విడ్ ప్రోకు పాల్పడలేదు. న్యాయవ్యవస్థపై నాకున్న విశ్వాసంతోనే ఇక్కడ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలపడం కోసం మంత్రిగా పనిచేశాను. నా కార్యాచరణలో ఎలాంటి అవినీతి జరగలేదు’’ అని స్పష్టంచేశారు.
ఎవరికీ సమాధానం చెప్పడానికి సిద్ధం
‘‘బీఆర్‌ఎస్ పాలనలో నా బావమరుదులకు కాంట్రాక్టులు ఇవ్వడం జరిగిందనే ఆరోపణలు అసత్యం. అలాంటి అవినీతి నేను చేయలేదు. నా కోడుకు కాంట్రాక్టులు ఇవ్వలేదు. నేను తెలంగాణ బిడ్డను. హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి నన్ను అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను. ఎన్ని కేసులు పెట్టినా నాకు భయం లేదు’’ అని కేటీఆర్ ధీమాగా చెప్పారు.
తలవంచే ప్రసక్తే లేదు
‘‘నాపై ఆరోపణలు చేస్తున్న వారు సత్యాన్ని ఎదుర్కొనాలి. మా పట్ల రాజకీయ ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నవారికి నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను ఎప్పటికీ తలవంచను. తెలంగాణ ప్రజల కోసం చివరి వరకు పోరాడతాను. అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తాను’’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
విచారణపై ఉత్కంఠ
కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఉన్నారు. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నిధుల మళ్లింపుపై ప్రధానంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఈ విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

One thought on “అవసరమైతే ప్రాణాలిచ్చినా తలవంచేది లేదు: కేటీఆర్ స్పష్టీకరణ”
Comments are closed.