Amazon : డేటా సెంటర్ విస్తరణ కోసం ఒప్పందం కుదిరింది

అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు

అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో జరిగిన సమావేశంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమెజాన్ ₹60,000 కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను విస్తరించేందుకు అడుగులు పడనున్నాయి.

మరోవైపు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇన్ఫోసిస్ సీఎఫ్వో సంగ్రాజ్తో సమావేశమై, పోచారంలో ₹750 కోట్ల ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో కొత్తగా 17,000 ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలతో కలిసి ఐటీ రంగంలో విస్తరణకు కట్టుబడి ఉంది.