తమిళ విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ రూపొందించిన యుగానికి ఒక్కడు అప్పట్లో ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం. పాన్ ఇండియా సినిమా ట్రెండ్ మొదలుకాకముందే కార్తిని లీడ్ రోల్‌లో తీసుకుని రూపొందించిన ఈ సినిమా, తన విశిష్టమైన కథ, విజువల్స్‌తో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల తెలుగు వెర్షన్ రీ రిలీజ్ అయినా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇది సీక్వెల్ రావాలని కోరుతున్న వాయిస్‌కి బలాన్ని ఇచ్చింది.
ఇంతలో దర్శకుడు సెల్వరాఘవన్ యుగానికి ఒక్కడు-2 సినిమాను కార్తితో కాకుండా ధనుష్‌తో రూపొందిస్తానని కొన్ని సంవత్సరాల క్రితం అనౌన్స్ చేసి షాకిచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ సెట్స్ మీదికి వెళ్లకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సెల్వ.. ధనుష్‌తో తొందరగా సినిమాను అనౌన్స్ చేయడమే తాను చేసిన తప్పని అంగీకరించారు. కార్తి లేకుండా యుగానికి ఒక్కడు-2 అసాధ్యమని స్పష్టంగా తెలిపారు.
అయితే యుగానికి ఒక్కడు-2 లాంటి గ్రాండ్ సినిమాను తెరకెక్కించాలంటే పెద్ద బడ్జెట్‌తో పాటు ఎంతో మంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులను ఒకేచోట చేర్చాల్సి ఉంటుందని సెల్వ అన్నాడు. ఇవన్నీ తేలికగా జరిగే విషయాలు కావని, సరైన పరిస్థితులు ఏర్పడితే భవిష్యత్తులో తప్పకుండా ఈ ప్రాజెక్ట్‌ను కార్తితో తీస్తానని తెలిపారు. అలాగే ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న బృందావన కాలనీ-2 చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయిందని వెల్లడించారు.

One thought on “యుగానికి ఒక్కడు సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు సెల్వ!”
Comments are closed.